ఆరు పదుల వయసులో.. ఆకట్టుకునే డ్యాన్స్‌..!

ముంబై : సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్ర ట్విటర్‌లో తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో ఆనందం అంటే ఇదేనేమో..! అనేలా ఉంది. ఓ ఆరు పదుల వయసు దాటిన మహిళ వంట చేస్తూ చలాకీగా డ్యాన్స్‌ చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా మాంసాహారం తయారు చేస్తున్న ఆ బామ్మ.. సరికొత్త స్టెప్పులతో అదరగొట్టింది. ‘మీలాగే.. నేనూ న్యూఇయర్‌ సందర్భంగా చాలా వీడియో మెసేజ్‌లు అందుకున్నా. అన్నిటిలో ఈ వీడియో నన్ను అమితంగా ఆకట్టుకుంది. అయితే, వీడియోలో ఉన్నదెవరో.. ఎవరు ఈ వీడియో తీశారో తెలియదు. కానీ, బామ్మ డ్యాన్స్‌ నన్ను పండుగ మూడ్‌లోకి తీసుకెళ్లింది. ఇంటికి వెళ్లిన మరుక్షణం.. బామ్మ డ్యాన్స్‌ మూమెంట్లను ప్రాక్టిస్‌ చేస్తా..!’అని ఆనంద్‌ మహింద్ర ట్వీట్‌ చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top