ఫుల్ ఫామ్‌తో ఉన్న కోహ్లి.. లాంగ్ ఆన్‌లో కొట్టిన బంతి... ఎవరూ ఊహించని క్యాచ్. ఢిల్లీ డెవిల్స్ ప్లేయర్ ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్ ఆటగాడు) పట్టిన సూపర్ క్యాచ్‌తో ఏం జరుగుతుందో అర్థంకాక కోహ్లి కాసేపు బిత్తరపోయాడు. క్రికెట్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ క్యాచ్ గురించే చర్చిస్తోంది. గత రాత్రి బెంగళూర్ రాయల్స్ ఛాలెంజ్ వర్సెస్ ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హర్షల్ పటేల్ వేసిన ఫుల్ టాస్ బంతిని కోహ్లి బౌండరీ మీదకు తరలించాడు. అయితే అప్పటికే లైన్ వద్ద ఉన్న కాసుకుని ఉన్న బౌల్ట్.. బంతి గాల్లో ఉండగానే అమాంతం ఎగిరిన కుడి చేత్తో ఒడిసి పట్టేశాడు. ఆపై బౌండరీ లైన్‌పై పడకుండా బాడీని బ్యాలెన్స్ చేశాడు.