టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక ఎంత వేగంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఏమాత్రం అవకాశం దొరికినా రెప్పపాటులో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను అమాంతం ఇరుకున పడేస్తాడు ధోని. అయితే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చేసిన రనౌట్ ధోనిని గుర్తుకు తెచ్చింది. బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ అజింక్యా రహానేను దినేశ్ కార్తీక్ ఔట్ చేసిన విధానం చూస్తే ధోనీ కూడా ఆశ్చర్యపోతాడేమో అంటున్నారు అభిమానులు.