రోహిత్ శర్మ ఔటైన తర్వాత, స్టాండ్‌లో భార్య రితికాతో కలిసి ఉన్న కూతురు సమైరాతో మాట్లాడేందుకు యత్నించాడు. ఇలా రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ నుంచే కూతురితో మాట్లాడేందుకు యత్నించిన సమయంలో అభిమానులు ఫొటోలు కోసం పోటీ పడ్డారు. వరుసగా సెల్ఫీలు తీస్తూ రోహిత్‌ను కెమెరాలో బంధించారు. దీన్ని పోస్ట్ చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మ ఎవరితో మాట్లాడుతున్నాడో కనిపెట్టండి అంటూ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.