వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను ప్రశ్నించినందుకు అరెస్టయిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఆయనను సెట్రల్ జైలుకు తరలించారు. ఆయన అరెస్ట్‌పై పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటంరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.