తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మృత దేహాలను వెలికితీశారు. బోటు 315 అడుగుల లోతుకు మునిగిపోయినట్లుగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గుర్తించాయి. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే ప్రమాదానికి 5 నిమిషాల ముందు పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా తీసుకున్న వీడియో ఒకటి ఇప్పడు బయటకు వచ్చింది.