చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఎంతమాత్రం సహించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మొట్టమొదటి కలెక్టర్లు, ఎస్పీల సదస్సుల స్పష్టం చేశారని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీకి చెందిన వారు కూడా ఏదైనా అవకతవకలు చేసిన దాఖలాలు ఉంటే.. చర్యలు తీసుకోవాల్సిందేనని వైఎస్ జగన్ తేల్చి చెప్పారని తెలిపారు. ద్రవ్యవినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బుగ్గన సమాధానమిచ్చారు.