మూగజీవిని చితకబాది సెల్ఫీలు తీసుకున్న యువకులు | Watch: Young Boys Kicked Python In Mumbai and Take Selfies | Sakshi
Sakshi News home page

మూగజీవిని చితకబాది సెల్ఫీలు తీసుకున్న యువకులు

Aug 8 2020 1:08 PM | Updated on Mar 22 2024 10:50 AM

ముంబై: జాలి లేకుండా కొందరు యువకులు ఒక కొండ చిలువను హింసించి సెల్ఫీలు తీసుకున్నారు. ఈ  ఘటన బోరీవాలీలోని హనుమాన తెక్డీ ఏరియాలో జరిగింది. ముంబైలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇలా జోరుగా వానలు కురుస్తుండటంతో కొన్ని  వన్యప్రాణులు వాటి స్థావరాలను వదిలి పొడి ప్రాంతాలకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక కొండ చిలువలువ నీరు లేని ఒక ప్రాంతానికి వెళ్లాలనుకుంది. అలా వెళుతున్న క్రమంలో ఆ మూగజీవి కొందరు ఆకతాయిల కంటపడింది.  వారు దాన్ని పట్టుకొని ఇష్టమొచ్చినట్లు  కాళ్లతో తన్ని, చేతులతో కొట్టి అది వాళ్లకు లొంగాక దానితో సెల్ఫీలు తీసుకున్నారు. 

సెల్ఫీలు తీసుకున్న అనంతరం 8.5 అడుగుల కొండచిలువను ఓ సంచిలో పెట్టి దగ్గర్లోని అడవిలో వదిలేశారు. కొండచిలువను కొడుతున్నవీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వన్యప్రాణి సంరక్షణ కర్త పవన్ శర్మ ఆ వీడియో ఆధారంగా అటవీ అధికారులకు ఫిర్యాదు  చేశారు.  వెంటనే స్పందించిన అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వాళ్లపై కేసు నమోదు చేశారు. వారిని విచారించిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement