ఆంద్రజ్యోతి కాదు.. అది కులజ్యోతి | Vijaya Sai Reddy Fire On ABN Andhrajyothy, Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఆంద్రజ్యోతి కాదు.. అది కులజ్యోతి

Apr 6 2019 6:40 PM | Updated on Mar 20 2024 5:06 PM

విజయసాయి రెడ్డి శనివారమిక్కడ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘ఇటీవల విశాఖలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు నాకు అండాగా ఉండాలి. లేకపోతే నేను జైలుకు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. చంద్రబాబు మాత్రమే కాదు... గత అయిదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి సహకరించిన వారందరూ...ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వ్యక్తులు కూడా జైలుకు వెళతారు. విశాఖలో ఓ గర్భిణీ స్త్రీపై వైఎస్సార్ సీపీ దాడి చేశారని చంద్రబాబుతో పాటు ఆంధ్రజ్యోతిలో అడ్డగోలు కథనాలు ప్రచురిస్తున్నారు. అయితే విశాఖ పోలీసులు కూడా మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినా, చంద్రబాబు మాత్రం ఇంకా మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఇక లోక్‌నీతి సర్వే అంటూ బోగస్ ప్రచారం చేశారు. చివరికి లోక్‌నీతి సంస్థ కూడా ఆ సర్వే మాది కాదని ఖండించింది. ఇది చంద్రబాబు, రాధాకృష్ణ మొహం మీద ఉమ్మినట్లు అయింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement