రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ.లక్షా 65 వేల కోట్ల అంచనాలతో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిసింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఆదివారం రాత్రి ప్రగతిభవన్‌లో సమావేశ మైన రాష్ట్ర మంత్రివర్గం కొత్త బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీంతోపాటే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు.