పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతిని రాజు పెళ్లి చేసుకున్నాడు. 6 నెలల క్రితం జి.కొత్తపల్లికి మకాం మార్చాడు. జీడితోటలకు కాపలాదారుడుగా ఉంటూ అక్కడి అటవీ ప్రాంతంలో పక్ష్లులను, జంతువులనూ వేటాడుతుంటాడు. ఈ క్రమంలో తారసపడ్డ ప్రేమజంటల్ని బెదిరించి డబ్బు వసూలు చేస్తాడు. యువతిపై కన్నుపడిందంటే డబ్బులిచ్చినా తీసుకోడు. చంపుతానని బెదిరించి అత్యాచారానికి ఒడిగడుతాడు. ఎదురు తిరిగితే ప్రాణాలు తీస్తాడు.