తమిళనాడులోని తిరువూర్ జిల్లాలో ప్రకృతి వైద్యంపై నమ్మకం ఓ కుటుంబంలో విషాదం నింపింది. యూట్యూబ్‌లో ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూసి.. స్నేహితురాలి సాయంతో బిడ్డకు జన్మనివ్వాలని ప్రయత్నించిన ఓ మహిళ అధిక రక్తస్రావం కావడంతో మరణించారు. ఈ నెల 22 న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.