ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కణ్నుంచి హెలికాఫ్టర్‌లో 2.05 గంటలకు మియాపూర్ హెలిప్యాడ్‌కు.. అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. 2.15 నుంచి 2.23 వరకు మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించి.. హైదరాబాద్ మెట్రోను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ప్రదర్శించే ఆడియో విజువల్ దృశ్యమాలికను తిలకిస్తారు.