చంద్రబాబు రాత్రికి రాత్రే రంగులు మార్చారు | MP Varaprasad Reveals Chandrababu Drama On Special Status | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాత్రికి రాత్రే రంగులు మార్చారు

Mar 16 2018 2:57 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కడ పేరొస్తుందోనని భయపడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే రంగులు మార్చారని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ మండిపడ్డారు. నిన్నటి వరకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నానని చెప్పిన అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకుని, లేదు మేం వేరుగా వెళ్తున్నామంటూ చంద్రబాబు ప్రకటించాడన్నారు. ఢిల్లీలో పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీ వరప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ సీపీకి భయపడి తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి వస్తుందని, అంతేగానీ వారికి టీడీపీకి ప్రత్యేక హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement