బోటు అనుమతులకు విధానాలు మారుస్తాం | Minister Bhuma Akhila Priya Meeting with Private Boat Operators | Sakshi
Sakshi News home page

బోటు అనుమతులకు విధానాలు మారుస్తాం

Nov 14 2017 5:24 PM | Updated on Mar 22 2024 11:27 AM

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద కృష్ణా నది పవిత్ర సంగమం ప్రాంతంలో 22 నిండుప్రాణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది. ఈ ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ కొన్ని విషయాలను స్పష్టం చేశారు. మంత్రి బోటింగ్‌ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. బోటింగ్‌ అనుమతులకు సంబంధించి విధానాలు మారుస్తామని చెప్పారు. ఇప్పటివరకు నదిలో పడవలు నడుపుకునేందుకు పర్యాటక శాఖతో సంబంధం లేకుండా జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆ విధంగా అనుమతులు తీసుకున్నవారెవ్వరూ పర్యాటక శాఖతో అగ్రిమెంట్‌​కావటం లేదని మంత్రి అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement