చెదురుమదురు ఘటనలు మినహా మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ మందకొడిగానే సాగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు నేడు పోలింగ్ జరిగింది. కాగా పోలింగ్ అనంతరం విడులైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కమలం వైపే మొగ్గు చూపాయి. మహారాష్ట్రలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పలు సర్వేలు తెలిపాయి. బీజేపీ-శివసేన కూటమి తిరుగులేని మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి.