అవినీతి పై మీ పోరాటం ఏమయ్యింది? | This Is Last Election For ChandraBabu Naidu Says C Ramachandraiah | Sakshi
Sakshi News home page

అవినీతి పై మీ పోరాటం ఏమయ్యింది?

Mar 13 2019 11:59 AM | Updated on Mar 22 2024 11:29 AM

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయలేదన్న కారణంతోనే చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సీ రామచంద్రయ్య ఆరోపించారు. జేడీ లక్ష్మీనారాయణ ద్వారా వైఎస్‌ జగన్‌ను జైల్లో పెట్టించడానికి చంద్రబాబే కారణమని, ఇందుకు ఆయన టీడీపీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారమే నిదర్శమని అభిప్రాయపడ్డారు. జేడీ లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబుకు సహకరించారని, దానికోసమే ఆయన మేలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం రామచంద్రయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న అవినీతి జేడీకి కనిపించట్లేదా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement