పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన జేసీ దివాకర్‌ రెడ్డి | JC Diwakar Reddy surrender in Police Station | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన జేసీ దివాకర్‌ రెడ్డి

Jan 4 2020 2:11 PM | Updated on Mar 21 2024 8:24 PM

సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి శనివారం అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. కాగా జేసీ పోలీసులపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చాక ‘పోలీసులతో బూట్లు నాకిస్తా...గంజాయి కేసులు పెడతాం’ అంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే రెచ్చిపోయారు. దీంతో అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్ నాథ్ ఫిర్యాదు మేరకు 153, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సొంత పూచీకత్తుతో పాటు నెలకు రెండు సార్లు పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాలని న్యాయస్థానం షరతు విధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement