చంద్రన్న విలేజ్‌ మాల్స్‌లో ధరల షాక్‌!

చౌకధరల దుకాణాల స్థానంలో నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రారంభించిన ‘చంద్రన్న విలేజ్‌ మాల్స్‌’లో ధరలు షాక్‌ కొడుతుండడంతో ప్రజలు నిరసనాగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో లభిస్తున్న ధరలకన్నా ఈ మాల్స్‌లో ధరలు ఎక్కువ ఉండడం చూసి జనం అవాక్కవుతున్నారు. ధరల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుండడంతో చంద్రన్న మాల్స్‌లో అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం సబ్బులు, ఇతర సౌందర్యసాధనాలు మాత్రమే విక్రయిస్తున్నారు. అవి కూడా మార్కెట్‌ రేట్లకే కావడం విశేషం. ఒకటి రెండు రోజుల్లో సరుకులన్నీ వస్తాయని డీలర్లు చెబుతున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ రేషన్‌ షాపులను.. రిలయన్స్‌తో పాటు చంద్రబాబుకు వాటాలున్న ఫ్యూచర్‌ గ్రూప్‌లకు అప్పగించేస్తుండడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడుతుండగా అవే ఉత్పత్తుల ధరలు వినియోగదారుల వద్దకు వచ్చేసరికి దిమ్మతిరిగేలా షాక్‌ కొడుతున్నాయి. అందులోనూ చౌకధరల దుకాణాలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు తెచ్చిన చంద్రన్న మాల్స్‌లో ధరలు భారీగా ఉండడంపై వినియోగదారుల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top