ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల అప్పులపై వడ్డీ రూపంలో చెల్లించాల్సిన సుమారు రూ.1,020 కోట్లను అక్టోబర్ 2వ తేదీలోగా వారి అప్పు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలానికి మహిళల అప్పులపై వడ్డీగా చెల్లించాల్సిన డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.