ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రముఖ కవి, రచయిత, వాగ్గేయకారుడు, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి బాలాంత్రపు రజనీకాంతరావు (99) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస వదిలారు. ఆకాశవాణి, దురదర్శన్‌ కేంద్రాల్లో ఆయన పనిచేశారు. 1920 జనవరి 29న పశ్చిమగోదావరి జిల్లా నిడదోలులో రజనీకాంత రావు జన్మించారు. ఆయన తండ్రి బాలాంత్రపు వేంకటరావు ప్రసిద్ది చెందిన వేంకట పార్వతీవ కవుల్లో ఒకరు. 1942 జూలైలో ఆకాశావాణి మద్రాస్‌ కేంద్రంలో కళాకారుడిగా రజనీకాంత రావు చేరారు. ఆకాశవాణిలో తొలి స్వరకర్తగా శ్రోతలను అలరించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top