తన బంధువు రణధీర్ రెడ్డిని ఐటీ అధికారులమని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అనుచరుడు ఉదయసింహ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చైతన్యపురి లిమిట్స్, జైపురి కాలనీలో నివసించే తన బంధువు రణధీర్ రెడ్డి ఇంట్లో ఆదివారం కొంతమంది సోదాలు నిర్వహించారన్నారు.