ఎంపీ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ | Congress MP Revanth Reddy Arrested By Police | Sakshi
Sakshi News home page

ఎంపీ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌

Mar 2 2020 6:16 PM | Updated on Mar 21 2024 8:24 PM

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ ఎనుముల రేవంత్‌ రెడ్డి పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ గండిపేట చెరువుకు వెళ్లే దారిలో అక్రమంగా ఫామ్‌హౌస్‌ నిర్మించారని ఆరోపిస్తూ.. దానిని ముట్టడించడానికి రేవంత్‌ రెడ్డి తన అనుచరులతో వెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, మార్గమధ్యలో జన్వాడ వద్ద అరెస్ట్‌ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని, వారితో పాటు అనుచరులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అరెస్టు సందర్భంగా జన్వాడ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

అరెస్టు సందర్భంగా రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ,  111 జీవోను అతిక్రమించి మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుమారుడు కేటీ‍ఆర్‌లు చట్టాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని రేవంత్‌  తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఫామ్‌హౌస్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని దుయ్యబట్టారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement