అన్నీ జగన్‌ చెప్పినవే.. | Chandrababu Owes An Apology To BCs: YSRCP | Sakshi
Sakshi News home page

అన్నీ జగన్‌ చెప్పినవే..

Jan 28 2019 7:14 AM | Updated on Mar 22 2024 11:23 AM

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇదివరకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎన్నికల వేళ వరుసగా కాపీ కొడుతున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన బీసీ సదస్సులో ఆయా కులాలకు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ప్రతి కులానికీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని వైఎస్‌ జగన్‌ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని కులాలను ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చేరుస్తానని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పటి వరకు ఆ మాట నిలుపుకోలేదు. కేంద్రంపై నెట్టేసి చేతులు దులుపుకున్నారు. తాజాగా ప్రస్తుతం ఉన్న 11 బీసీ ఫెడరేషన్‌లను కార్పొరేషన్‌లుగా చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement