పన్ను వసూళ్లలో సామాన్యులపై ప్రతాపం చూపే సంస్థలు.. బలవంతుల ముందు మాత్రం తోకముడుస్తాయన్న విషయం తెలిసిందే. తన అనుచరుల వాహనాలను అనుమతించలేదన్న సాకుతో ఓ టోల్‌గేట్ ఉద్యోగిపై బీజేపీ ఎమ్మెల్యే గుండాగిరీకి దిగాడు. ఇష్టారీతిగా తిట్టి, చెయ్యిచేసుకున్నాడు. అయినాసరే, ఆయనపై కేసు నమోదుకాలేదు. సదరు టోల్‌గేట్ సంస్థా ఉద్యోగికి అండగా నిలవలేదు!