ఈఎస్‌ఐలో జరిగిన రూ.300 కోట్ల మేర అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లులో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మంత్రుల అండదండలతో మందులను సరఫరా చేయకుండానే బిల్లులను నమోదు చేసి పెద్ద ఎత్తున అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. అవసరంలేని, గడువు ముగిసిపోయే మందులను సరఫరా చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు.