హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం జీవో నంబర్ 750 జారీ చేసింది. ప్రస్తుత ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఎటువంటి ఎన్నికల విధులను ఏబీ వెంకటేశ్వరరావుకు అప్పగించవద్దంటూ జీవోలో పేర్కొంటూ.. హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.