జలవనరుల శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష | AP CM YS Jagan Review Meeting On Irrigation Department | Sakshi
Sakshi News home page

Jun 6 2019 6:44 PM | Updated on Mar 22 2024 10:40 AM

 వివిధ విభాగాల పనితీరును సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జలవనరుల విభాగం పనితీరుపై మరోసారి సమీక్ష నిర్వహించారు. గతవారం కూడా జలవనరుల విభాగం అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. సాగు, తాగు నీటి ప్రాజెక్టులతో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదంటూ అధికారులకు స్పష్టం చేశారు. సమగ్ర నివేదిక, వివరాలతో మరోసారి రావాలని ఆధికారులను ఆదేశించడంతో గురువారం తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌లో మరోసారి సమావేశమయ్యారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement