సబ్‌స్క్రైబ్‌ చేస్తే తిరుమల లడ్డూ ఉచితం | Subscribe and get a free Tirumala laddu | Sakshi
Sakshi News home page

సబ్‌స్క్రైబ్‌ చేస్తే తిరుమల లడ్డూ ఉచితం

Sep 1 2026 11:55 PM | Updated on Sep 1 2026 11:55 PM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సోషల్‌ మీడియా ప్రచారానికి వినియోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘ఒక్కసారి సబ్‌స్క్రైబ్‌ చేస్తే తిరుమల లడ్డూ ఉచితం’ అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి ఫేస్‌ బుక్‌లో ఈ వీడియోను పోస్టు చేసినట్లు తెలుస్తోంది. తన చానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసిన వారికి ఒక్కొక్కరికి ఒక్కో తిరుమల లడ్డూను ఇస్తున్నట్లు వీడియోలో చూపించారు. ఇలా సుమారు 30 మందితో సబ్‌స్క్రైబ్‌ చేయించుకుని.. వారికి 30 లడ్డూలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా మరో వీడియోలో తన చానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసి.. వీడియోకు లైక్, కామెంట్, షేర్‌ చేసిన వారికి తిరుమల లడ్డూల బాక్స్‌ను పంపిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఈ వీడియోలు వైరల్‌ కావడంతో భక్తుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సోషల్‌ మీడియా ప్రచారానికి ఉపయోగించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement