‘ఎంఎస్ ధోని’ బయోపిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. ఆదివారం ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ హఠాన్మరణ వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ యువహీరో ఇక లేరనే చేదు వార్తను బాలీవుడ్ ఇండస్ట్రీ దింగమింగుకోలేకపోతోంది. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. సుశాంత్ మరణ వార్త నిజం కాకుండా ఉంటే ఎంతో బావుంటుందంటూ వారు ట్వీట్లు చేస్తున్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
సుశాంత్ మరణం: షాక్‌లో సినీ ఇండస్ట్రీ
Jun 14 2020 4:37 PM | Updated on Jun 14 2020 4:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement