సాక్షాత్తూ ఏపీ ఆవిర్భావ దినోత్సవం నాడే.. | Chandrababu, Rahul Meeting on TDP, Congress Allaince | Sakshi
Sakshi News home page

Nov 1 2018 4:02 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఒకవైపు సోనియాగాంధీపై, మరోవైపు రాహుల్‌ గాంధీపై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు....ఇప్పుడు హస్తిన సాక్షిగా మరో కొత్త నాటకానికి తెరదీశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ను అడ్రస్‌ లేకుండా చేయాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పార్టీతో చెట్టపట్టాలు వేసుకోవడానికి తెగ ముచ్చటపడుతున్నారు. ఆ మధ్య.. ఏ ముఖం పెట్టుకుని రాహుల్‌ గాంధీ మా రాష్ట్రానికి వస్తారు? ఎవరైనా కాంగ్రెస్‌కు సహకరిస్తే వారిని ఏమనాలి? అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇప్పుడు ప్లేటు మార్చేశారు. ఇప్పుడు మరోసారి ఢిల్లీకి వెళ్లారు. రాహుల్‌ గాంధీతో మంతనాలు జరిపారు.

Advertisement
Advertisement