పారాలింపిక్స్-2016లో మరో భారత అథ్లెట్ మంగళవారం పసిడి సాధించాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో పాల్గొన్న దేవేంద్ర ఝఝారియా.. అంతకుముందు తన పేరిట ఉన్నప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 63.97 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి.. 62.15 మీటర్ల గత రికార్డును తిరగరాశాడు.