టీఆర్ఎస్ లో చేరిన ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ పై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారిని కలిసి వైఎస్ఆర్ సీసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ లో చేరిన మదన్లాల్ పై ప్రజాప్రాతినిథ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. మదన్లాల్ టీఆర్ఎస్ లో చేరినట్టుగా స్పీకర్ కు ఆధారాలు సమర్పించారు. అన్ని విషయాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని స్పీకర్ తమకు హామీయిచ్చారని వైఎస్ఆర్ సీపీ నాయకులు తెలిపారు. స్పీకర్ ను కలిసిన వారిలో జనక్ప్రసాద్, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్ ఉన్నారు.
Oct 9 2014 4:54 PM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement