మైసూర్ రాజవంశానికి ఉసురు తగిలిందా? ఎన్నో ఏళ్ల క్రితం నాటి శాపం, ఇంకా వెంటాడుతోందా?... మైసూర్ సంస్థానం చివరి రాజైన నరసింహరాజ వడయార్ అకాల మరణంతో ఈ ప్రశ్నలే తలెత్తుతున్నాయి. అయితే, ఇవన్నీ మూడ నమ్మకాలే అని కొంతమంది కొట్టి పారేస్తుండగా, మరికొందరు మాత్రం ఇందులో నిజం లేకపోలేదని చరిత్రను తిరగేస్తున్నారు. మరోవైపు వడయార్ అకాల మరణంతో ఆ సంస్థానంలో కొనసాగే రాజు ఎవరనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.