రసకందాయంలో బెజవాడ రాజకీయం | vijayawada politics heat up with lagadapati rajagopal issue | Sakshi
Sakshi News home page

Apr 15 2017 9:35 AM | Updated on Mar 22 2024 11:19 AM

బెజవాడ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ట్రావెల్స్‌ వ్యవహారంలో ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే బోండా ఉమా... ముఖ్యమంత్రి వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. కాపుల గొంతు కోస్తున్నారంటూ బోండా ఉమా తన ఆగ్రహాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం వివాదంతో ఎంపీ కేశినేని నానీకి... ముఖ్యమంత్రికి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రావెల్స్‌ మూసివేత నిర్ణయం వద్దని ముఖ్యమంత్రి వారించినా నాని మాత్రం ఆయన మాటను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement