చంచల్గూడ ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తు | Tight security at chanchalguda jail main gate | Sakshi
Sakshi News home page

Aug 28 2013 12:38 PM | Updated on Mar 20 2024 1:46 PM

ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ చంచల్గూడ జైలులో ఆమరణ నిరాహర దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో జైలు ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. అందులోభాగంగా ఎక్కడికక్కడ ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ దీక్ష బుధవారం నాటికి నాలుగోరోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉండేలా వైద్యులను జైలు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే నిర్బంధంలో ఉన్న జనం కోసం దీక్ష చేపట్టిన జగన్కు అన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. వైఎస్ జగన్కు మద్దతు తెలిపేందుకు ఆయన అభిమానులు నిత్యం వేలాది మంది చంచల్గూడ జైలుకు తరలివస్తున్నారు. అయితే వారిని పోలీసులు జైలు సమీపంలోకి రానివ్వకపోవడంతో వారు నిరాశతో వెనతిరుగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement