గుంటూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా భూమి సేకరణపై రైతులు మండిపడ్డారు. ముఖ్యంగా మహిళా రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ధ్వజమెత్తారు. ఓ మహిళా రైతు ఆవేశంగా తన బాధ వివరించారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు.