ఏపీ సర్కారుపై తెలంగాణ దాడి: పరకాల | telangana-govenrment-attacking-ap-government-says-parakala-prabhakar | Sakshi
Sakshi News home page

Nov 3 2014 8:29 PM | Updated on Mar 20 2024 3:45 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ సర్కారు దాడి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ చేష్టలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. కార్మికశాఖ ఫైనాన్స్ మేనేజపర్ రామారావును గంట సేపటి పాటునిర్బంధించే అధికారం వాళ్లకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని బ్యాంకులకు లేఖలు రాసే అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎవరిచ్చారని అడిగారు. చెక్కులను ఆమోదించొద్దని చెప్పే అధికారం పోలీసులకు ఎక్కడిదని నిలదీశారు. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సర్కారు దాడి చేస్తోందని, ఈ అంశాలన్నింటినీ గవర్నర్కు కూడా ప్రతిసారీ వివరిస్తున్నామని పరకాల ప్రభాకర్ చెప్పారు. గవర్నర్ ఈ అంశంపై ఎన్నిరోజుల్లో స్పందిస్తారో చూస్తామని అన్నారు. రెండు మూడు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం పాల్పడుతున్న చట్ట ఉల్లంఘనలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ ఫిర్యాదు చేస్తారని కూడా ప్రభాకర్ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement