దివంగత మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబసభ్యులను పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. మెదక్ జిల్లా పర్యటనలో తొలిరోజు ఆదివారం షర్మిల మూడు నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను పరామర్శించారు. సోమ, మంగళవారాల్లో మెదక్ జిల్లాలో మరో ఆరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.