భారత్ గూఢచారిగా పాకిస్థాన్ ఆరోపణలు చేసిన కుల్‌భూషణ్ జాదవ్ అప్పగింత విషయంలో ఆ దేశం యూ టర్న్ తీసుకుంది. తమ దేశంలో జాదవ్ విద్రోహ చర్యలకు పాల్పడ్డాడని, తమ దగ్గర బలమైన ఆధారాలున్నాయని, ఆయన్ను భారత్‌కు అప్పగించబోమని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారి సర్తాజ్ అజీజ్ చెప్పారు. జాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.