కశ్మీర్‌లో పాక్ దురాగతం | Pak atrocity in Kashmir | Sakshi
Sakshi News home page

Nov 23 2016 7:50 AM | Updated on Mar 22 2024 10:55 AM

జమ్మూ కశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులు మరోసారి దురాగతానికి పాల్పడ్డారు. మంగళవారం వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసీ)ను దాటి ముగ్గురు భారత సైనికులను మెరుపుదాడిలో చంపేసి, వారిలో ఒకరి తలను కిరాతకంగా నరికేశారు. గత నెలరోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. మృతులను రాజస్తాన్‌కు చెందిన ప్రభు సింగ్ (25), ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుష్వాహ (31), శశాంక్ సింగ్ (25)లుగా గుర్తించారు. ప్రభు తలను నరికివేశారు. దీనికి ప్రతీకారం భారీగానే ఉంటుందని భారత్ హెచ్చరించింది. పాక్ సరిహద్దు యాక్షన్ టీం (బ్యాట్) సభ్యులు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement