ఎన్నికల నియమవళిని ఉల్లంఘిస్తే మంత్రులకైనా నోటీసులిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. నంద్యాలలో పెద్ద ఎత్తున మంత్రులు తిష్ట వేయడం తమ దృష్టికి వచ్చిందన్నారు. మంత్రుల పర్యటనను సుమోటోగా స్వీకరించామని, వారి పర్యటనపై దృష్టి పెట్టాలని తాము సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.