కొన్నిరోజుల కిందట ఎయిరిండియా సిబ్బందితో గొడవకు దిగిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన పోలీసులతో మాటలయుద్ధానికి దిగారు. మరాఠ్వాటాలోని లాతూర్ ప్రాంతంలో ఏటీఎంలలో డబ్బులు లేకపోవడాన్ని నిరసిస్తూ ఆయన పోలీసులతో వాడీవేడి వాగ్వాదానికి దిగారు.