మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి బుధవారం నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నారు. చారిత్రక నేపథ్యం, జనాభా, ఇతర మండలాల ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని గత కొంత కాలంగా పోరాటాలు జరుగుతున్నాయి.