‘సాక్షి’ ‘బ్లాక్‌బలి’ కథనంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. బాహుబలి-2 బెనిఫిట్ షోలకు అనుమతి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తాము అయిదు ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఇచ్చామని ఆయన బుధవారమిక్కడ స్పష్టం చేశారు. ఎక్కువ ధరకు టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే కాంబో ఆఫర్ల పేరుతో మోసం చేస్తే ఉపేక్షించేది లేదని తలసాని హెచ్చరించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఉపేక్షించేది లేదన్నారు.