కేంద్ర మంత్రి పదవికి ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరు సాంబశివరావు రాజీనామా చేయడంపై ఆయన మంత్రి వర్గ సహచరుడు, జీవోఎం సభ్యుడు జై రాం రమేష్ గురువారం న్యూఢిల్లీలో స్పందించారు.గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కావూరి సాంబశివరావుకు ఓ సిద్దాంతమంటూ లేని జై రాం రమేష్ ఆరోపించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే కావూరి సాంబశివరావు పార్టీ మారుతున్నారని విమర్శించారు. విభజన అంశంపై కేబినెట్లో చర్చ జరుగుతున్నప్పుడు కావూరి ఎప్పుడూ వాకౌట్ చేయలేదని జై రాం రమేష్ గుర్తు చేశారు. సూడాన్లో పవర్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తీసుకుని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. దాంతో భారత్ ప్రభుత్వానికి కావూరి వల్ల చెడ్డ పేరు వచ్చిందన్నారు.