చంచల్గూడ జైలు నుంచి విడుదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి అభిమానులు పూలతో ఘనస్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు తోచుకువచ్చారు. కిక్కిరిసిన జనంలో నుంచి వాహనం కదలడం కూడా కష్టమైపోయింది. ఎటు చూసినా జనమే జనం. రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. జై జగన్ అన్న నినాదాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. 485 రోజులు జైలులో ఉండి, బయటకు వచ్చిన యువనేతను చూసేందుకు యువత ఉత్సాహంగా తోసుకొనితోసుకొని ముందుకు వస్తున్నారు. చిరునవ్వుతో అందరికీ రెండు చేతులు జోడించి అభివాదం చేస్తున్నారు. జైలు నుంచి ఆయన వాహనం వెళ్లే రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. కాన్వాయ్ వెంటే జనం నడుస్తున్నారు. జైలు వద్ద నుంచి ఆయన నివాసం లోటస్పాడ్ వరకు రోడ్డుకు ఇరువైపుల జనం బారులు తీరి ఉన్నారు. ఆ జనవాహినిని తప్పించుకొని ఆయన ఇంటికి చేరుకోవడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
Sep 24 2013 5:11 PM | Updated on Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement