మంచిర్యాల జిల్లా బెల‍్లంపల్లిలోని సివిల్ కోర్టు ముఖద్వారం ఎదుట హోంగార్డు నారాయణ మంగళవారం ఉదయం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. ఏడు సంవత‍్సరాలుగా హోంగార్డులకు పోస్టింగ్ ఇవ‍్వలేదని, విధుల‍్లోకి తీసుకోకుండా పోలీసు విభాగం అన్యాయం చేస్తోందని ఆవేదన వ‍్యక‍్తం చేస్తూ తెలంగాణ హోంగార్డుల సంఘం అధ‍్యక్షుడు నారాయణ మంగళవారం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు.