ఉత్తరాంధ్రతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో.. వచ్చే 24 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు బలోపేతం కావడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.