దేశంలో సంచలనం సృష్టించిన దాద్రి ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒక యువకుడు చనిపోయాడు. ప్రస్తుతం జైలులోనే ఉన్న అతడు మృత్యువాత పడ్డాడు. డెంగ్యూ లేదా చికెన్ గునియావంటి వ్యాధుల కారణంగా అతడు చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతుండగా తమ కుమారుడిని పోలీసులే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.